ప్రబోధ్, ప్రవీణ్, ప్రాజ్ఞల సహాయ౦ తీసు కోండి

ప్రేరేపించు పఠనానుభవం

ఇతర భారతీయ భాషల సహాయంతో హిందీ నేర్చుకోవడానికి ఇక్కడ నొక్కండి

ఇంచుమించుగా మన జీవితంలో విద్యావిభాగం, భాషనేర్చుకోవడం, శిక్షణలతోపాటు అన్నిరంగాలలోను కంప్యూటరు విజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. కంప్యూటర్ సాధించిన కొత్తకొత్త అభివృద్ధులు, కృత్రిమ జ్ఞానం, వివిధ మాధ్యమాల సాంకేతిక పరిజ్ఞానాల వలన శ్రవణ, దృశ్య మరియు వీడియోల సహకారంతో క్రియాశీలమైన పరస్పర బోధనకు అవకాశం కలిగేటట్లు భాషను రూపొందించటానికి వీలుంది. అస్సామీ, వంగ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియ, పంజాబీ, తమిళం, తెలుగు భాషల మాధ్యం ద్వారా హిందీ భాషను నేర్చుకోవడానికి ప్రస్తుత లీలా (కృత్రిమ జ్ఞానంతో భారతీయ భాషలను నేర్చుకొనుట) హిందీ ప్రబోధ్, ప్రవీణ్ మరియు ప్రాజ్ఞ ప్యాకేజీలు ప్రపంచ వ్యాప్తంగా వెబ్‌లో మిత్రుని వంటి మరియు సమర్థవంతమైన సాధనాన్ని అందిస్తోంది. 

 ఈ ప్యాకేజీలను వైయక్తికంగాను, జట్లుగానూ కూడా సమానంగా వాడుకోవచ్చు. ఏమైనప్పటికి అవి ఉపాధ్యాయునకు ప్రత్యామ్నాయం కాదు. పాఠాలను ఆసక్తి కరంగా చేయడానికి, రోజువారీ కృత్యాన్ని తగ్గించడానికి విద్యార్థుల ప్రధాన సమస్యలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించడానికి ఉపాధ్యాయుడు కూడా వీటిని వాడవచ్చు. అధికార భాషా విభాగం, గృహమంత్రిత్వశాఖ, భారతదేశ ప్రభుత్వం వారిచే హిందీ ప్రబోధ్, ప్రవీణ్, ప్రాజ్ఞల పాఠ్య ప్రణాళికల ఆధారంగా తయారైన కోర్సులు తరగతి విద్యా బోధనలోను, దూర విద్యాబోధనలోను ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి.


 

లీలా హిందీ ప్రబోధ్

లీలా హిందీ ప్రబోధ్ - మొదటి స్థాయి కోర్సు ఉద్దేశ్యం అధికార భాషలో రోజువారీ పనిని నిర్వహించడానికి తగిన హిందీ భాష ప్రాథమిక జ్ఞానాన్ని అందజేయడం. ఈ ప్యాకేజీలో వర్ణ సమామ్నాయం, పదజాలం, పాఠాలు (51) మరియు నిఘంటువు మాడ్యూలులు ఉన్నాయి. 

1. : వర్ణ సమామ్నాయ మాడ్యూల్ :


2. పదజాల మాడ్యూల్ :
3. పాఠాల మాడ్యూల్ :

గమనిక ప్యాకేజీలో గల ఏ భాగానికైనా వెళ్లటానికి మౌస్ 'కుడి క్లిక్' ద్వారా 'నావిగేషన్ మెను' లేదా షార్టుకట్ మెను లను కూడా ఉపయోగించుకోవచ్చు. మరి కొన్ని వివరాలకు "F1" ని నొక్కండి. ' హెల్ప్ విండో ' కనిపిస్తుంది. మీకు సహాయం కావలసిన వర్గాన్ని ఎంచుకోండి. 


4. నిఘంటువు మాడ్యూల్ : 

గమనిక : ఇది పరిమితమైన (సమగ్రమైన) నిఘంటువు.




లీలా హిందీ ప్రవీణ్ 

Ùలీలా హిందీ ప్రవీణ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం, కార్పోరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన సంపూర్ణ రెండో/రెండవ స్థాయి హిందీ కోర్సు. లీలా హిందీ ప్రబోధ్ కోర్సును పూర్తి చేశాక ఉన్నత స్థాయి హిందీ భాషను నేర్చుకోవడానికి ఇది ఉపయోగిస్తుంది. నిత్య వ్యవహారంలో సంభాషించడానికి తగిన హిందీ భాషా జ్ఞానాన్ని సంపాదించు కోవడానికి, హిందీలో చక్కగా రాయడానికి, దానికి అవసరమైన వ్యాకరణంలో పటుత్వం సంపాదించడానికి సహాయం చేయడమే దీని ఉద్దేశ్యం.

ప్రవీణ్ ప్యాకేజీలో 27 పాఠాలు, 4 పునరీక్షణ పాఠాలు మరియు నిఘంటువు మాడ్యూల్సు ఉన్నాయి..

1. పాఠాల మాడ్యూల్ 

2. నిఘంటువు మాడ్యూల్

గమనిక : ఇది పరిమితము (సమగ్రమైన) నిఘంటువు.




లీలా హిందీ ప్రాజ్ఞ

లీలా హిందీ ప్రాజ్ఞ కోర్సు విద్యార్థికి హిందీలో యూనియన్ ప్రభుత్వానికి అనువైన కార్యాలయ సంబంధి, విభిన్న ఉత్తర ప్రత్త్యుత్తరాలు, వ్యాఖ్యలు - అంటే నోట్లు, ఉత్తరువులు, మహజర్లు, దర ఖాస్తులు, సర్క్యులర్లు (గస్తీ పత్రాలు), అధి సూచనలు, నివేదికలు, కార్య వివరణలు, కార్యవ్యవహారాలు, అభ్యర్థనలు, జ్ఞాపకలేఖలు, పత్రికా ప్రకటనలు, అధికారిక సమాచారాలు మొదలగు వాటిలో ముసాయిదాలు రాయడంలో సామార్థ్యాన్ని పెంపొందించుకోవ టానికి ప్రత్యేకంగా రూపొందించ బడింది. ఇది విద్యార్థికి హిందీలో సరియైన సాంకేతిక పదాలను వాడే నేర్పును, భావప్రకటన చేసే నైపుణ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. కార్యాలయ నిర్మాణాలు, వివిధ కార్యాలయాల కార్యనిర్వహణలు, విధానాలు; ప్రభుత్వ ఫైలు పద్ధతి, పని నమూనాలు, వివిధ శాఖలలోను భాగాలలోను పని విభజన, వివిధరకాల ఉత్తర ప్రత్యుత్తరాలు, కార్యాలయాలలోఉపయోగించే పత్రాలు, టెంప్లేట్సుకు సంబంధించి, తగిన సమాచారం ప్రత్యక్షంగా గాని, అప్రత్యక్షంగా గాని లభించేటట్లు ఈ కోర్సు సామగ్రిలో ఉపయోగించిన కథనాలు, విషయాలు ప్రత్యేకంగా రూపొందించ బడ్డాయి. 

Õయూనియన్ ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ అధీనల బద్ద సంస్థలు (పబ్లిక్ సెక్టరు అండర్ టేకింగులు), కార్పోరేషన్లు మరియు ఆర్థిక సంస్థలలో పనిచేసే ఉద్యోగస్థులు అధికారభాషలో కార్యాలయ పనిని నిర్వహించడానికి తగిన సామర్థ్యం సంపాదించటానికి ఈ ప్యాకేజి ముఖ్యంగా ఉద్దేశింపబడినది.

ప్రాజ్ఞ ప్యాకేజి ఉపయోగించుకోవడానికి విద్యార్థి ముందుగానే హిందీ ప్రవీణ కోర్సును పూర్తి చేసైనా ఉండాలి లేదా ఇంచుమించు ఆ స్థాయికి తగిన హిందీభాష మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి. కార్యాలయ పత్రాలు, భావప్రకటనలు, సాంకేతిక పదజాలాల జ్ఞానం లేక పోవటంచేత హిందీలో కార్యాలయలకు సంబంధించిన పనులు సమర్థంగా నిర్వహించ లేని హిందీ మాతృభాషీయులు కూడా ఈ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. 

ప్రాజ్ఞ కోర్సు నిర్మాణం : 
ఈ కోర్సులో 31 పాఠాలున్నాయి. ఇవి నాలుగు విభాలుగా విభజింప బడ్డాయి : 
1. భాష ఆధారంగా పునరీక్షణ పాఠాలు (1 - 6)

2. ఉత్తర ప్రత్యుత్తరాల ముసాయిదా రాయడం (7 - 18)

3. హిందీలో నోటింగు (19 - 21) మరియు

4. యూనిట్ పరీక్షలు (1 - 10)


1. అనుబంధ మాడ్యూల్

2. నిఘంటు వు మాడ్యూల్

గమనిక : ఇది పరిమితమైన (సమగ్రమైన) నిఘంటువు.

ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయని, సులభసాధ్యములని, ప్రేరకములనీ ఆశిస్తున్నాము.మీ సూచనలు, పునర్భరణములను కోరుచున్నాము.



ఇతర భారతీయ భాషల సహాయంతో హిందీ నేర్చుకోవడానికి ఇక్కడ నొక్కండి